Bihar Elections: జేడీయూ, జన్ సురాజ్ స్టార్ క్యాంపెయినర్లుగా నితీష్, ప్రశాంత్ కిషోర్
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:25 PM
నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) 40 మంది ప్రముఖలతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను శుక్రవారం నాడు విడుదల చేసింది. నితీష్ కుమార్‌తో పాటు సీనియర్ నేతలు సంజయ్ కుమార్ ఝా, రాజీవ్ రంజన్ సింగ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Asembly Elections) తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ ఘట్టం శుక్రవారంతో పూర్తవడంతో ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటిస్తూ ప్రచారబరిలోకి దిగుతున్నాయి. జేడీయూ(JDU), జన్ సురాజ్(Jan Suraaj) పార్టీలు తమతమ పార్టీల తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించాయి.
జేడీయూ తరఫున 40 మంది
నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) 40 మంది ప్రముఖలతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను శుక్రవారం నాడు విడుదల చేసింది. నితీష్ కుమార్‌తోపాటు సీనియర్ నేతలు సంజయ్ కుమార్ ఝా, రాజీవ్ రంజన్ సింగ్ తదితరులు ఈ జాబితాలో చోటు సంపాదించారు.
20మందితో ప్రశాంత్ కిషోర్ ప్రచారం
ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ 20 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రచార బరిలోకి దింపుతోంది. ప్రశాంత్ కిషోర్‌తోపాటు ఉదయ్ సింగ్, మనోజ్ కుమార్ భారతి, రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్, సీతారామ్ యాదవ్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, పవన్ వర్మ తదితర పేర్లను ప్రకటించింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి రెండు విడతలుగా నవంబర్ 6, 11న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
నితీష్‌తో అమిత్‌షా భేటీ.. మొదటి విడత నామినేషన్లకు ఇవాళే చివరిరోజు
గాంధీనే విడిచి పెట్టలేదు, నేనెంత... ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి