Dhanteras Puja: దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:33 PM
దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది.
ఇంటర్నెట్, అక్టోబర్ 17: భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పండుగకు ముందు రోజున ఇంటికి శుభ్రం చేసి కొత్త రంగులతో ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. పండుగ రోజున మామిడితోరణాలు, ముద్దబంతి పూలతోఇంటి గుమ్మాలను చక్కగా అలంకరించి పండుగను జరుపుకుంటారు. ఆరోజున బంధువులు అందరూ ఒక్కచోటికి చేరుకుని.. మధుర పదార్థాలు వండి దేవతారాధన చేసి నివేదన చేస్తారు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించి ఆ తర్వాత దానినే ప్రసాదంగా స్వీకరిస్తారు. సాయంత్రం పూట ఇంటికి అంతటా కూడా దీపాలు వెలిగింది లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తారు. శైవ, వైష్ణవ క్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తారు.
ఇక దీపావళి పర్వదిన రోజున శుభ ముహూర్త సమయం కావున ప్రజలు ఎంతో నమ్మకంగా బంగారం కొనుగోలు చేస్తారు. కనీసం తమకు ఉన్నంతలో డబ్బులు సమకూర్చుకొని పుత్తడి కొనుగోలు చేస్తారు. దీంతో దేశ వ్యాప్తంగా బంగారం షాపులకు బలే గిరాకీ ఉంటుంది. ఫుడ్ డెలివరీ, గ్రోసరీస్ డెలివరీ చేస్తున్నట్టుగానే.. బంగారం కూడా ఈ పండుగ నుంచి డెలివరీ చేయాలని ఈ కామర్స్ బిజినెస్ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. అనుకున్నదే తడవుగా బంగారం కొనుగోలు చేసే తమ యూజర్ల కోసం వినూత్న ఆలోచనతో ఓ ఈ కామర్స్ బిజిజెస్ సంస్థ ముందుకు వచ్చింది.
దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు ఉన్న సింబల్‌ను బంగారు నాణేలపై ముద్రించి అమ్మకానికి పెట్టింది. యూజర్లు బ్లింకిట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికే లక్ష్మీ దేవి వస్తుంది. GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (0.5గ్రాములు) ధర రూ.6.999.. అలాగే GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (1 గ్రాములు) ధర రూ.13,949గా నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి:
Bhatti Vikramarka OBC Reservation: బంద్‌కు ప్రధాన కారణం బీజేపీనే: డిప్యూటీ సీఎం భట్టి
Dhanteras: ధన త్రయోదశికి బంగారం కొనలేకున్నా.. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే..