Bihar Polls: నితీష్‌తో అమిత్‌షా భేటీ.. మొదటి విడత నామినేషన్లకు ఇవాళే చివరిరోజు
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:12 PM
జాతీయ ప్రజాస్వామ్య కూటమి బిహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్నికలు వెళ్తోందని అమిత్‌షా ఇప్పటికే ధ్రువీకరించారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఆయనే సారథ్యంం వహిస్తారని చెప్పారు.
పాట్నా: కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా (Amit Shah) శుక్రవారంనాడు పాట్నాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో అమిత్‌షా, నితీష్ భేటీ ప్రాధాన్యత సంచరించుకుంది.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) బిహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్నికలు వెళ్తోందని అమిత్‌షా ఇప్పటికే ధ్రువీకరించారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఆయనే సారథ్యంం వహిస్తారని చెప్పారు. గతంలో జేపీ ఉద్యమంలోనూ, ఎమర్జెన్సీలోనూ పాల్గొన్న ప్రముఖ నేతల్లో కుమార్ ఒకరని ప్రశంసించారు. రాష్ట్రాల్లో కానీ, కేంద్రంలో కానీ పూర్తి మెజారిటీతో తాము ఎప్పుడు గెలిచినా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుంటామని, భాగస్వామ్య పార్టీలను ఎప్పుడూ గౌరవిస్తుంటామని చెప్పారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని తెలిపారు.
ఎన్డీయే సీట్ల షేరింగ్ ఫార్ములా
ఎన్డీయే సీట్ల పంపకాల ఫార్ములా ప్రకారం బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందూస్థాని అవామ్ మోర్చా (సెక్యూలర్), రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్ఎం) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో పోటీ చేస్తోంది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
మంగళూరులోనూ శ్రీవారి ఆలయం.. భూమి మంజూరు చేసిన ప్రభుత్వం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి