Gujarat Cabinet Reshuffle: ఉప ముఖ్యమంత్రిగా హర్ష్ సంఘవీ
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:47 PM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఆరో వ్యక్తి సంఘవి. కాంగ్రెస్ నేత చిమన్‌బాయ్ పటేల్ తొలి ఉప ముఖ్యమంత్రిగా 1972 నుంచి 73 వరకూ పనిచేశారు. పటేల్‌తో పాటు కాంగ్రెస్ మరో నేత కాంతిలాల్ ఘాయ్ ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి ఘన్‌శ్యామ్ ఓజా మంత్రివర్గంలో పనిచేశారు.
అహ్మదాబాద్: గుజరాత్ ఉప ముఖ్యమంత్రి (Gujarat Deputy CM)గా బీజేపీ నేత హర్ష్ రమేష్‌భాయ్ సంఘవీ ( (Harsh Rameshbhai Sanghavi)శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. గుజరాత్ మంత్రివర్గం పునర్వవస్థీకరణలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా 16 మంది రాష్ట్ర మంత్రులు గురువారం రాజీనామా చేశారు.
కాగా, సంఘవితో పాటు బీజేపీ నేతలు స్వరూజ్‌జీ ఠాకోర్, ప్రవీణ కుమార్ మాలి, రుషీకేశ్ పటేల్, దర్శన్ వాఘేలా, కున్వర్‌జీ బవలియా, రివబ జడేజా, అర్జున్ మోద్వాడియా, పర్సోత్తమ్ సోలంకి, జితేంద్ర వాఘాని, ప్రఫుల్ పాన్‌షేరియా, కునుభాయ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్న ఆచార్య దేవ్‌వ్రత్, ముఖ్యమంత్రి పటేల్ సమక్షంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
గుజరాత్ 6వ ఉప ముఖ్యమంత్రిగా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఆరో వ్యక్తి సంఘవి. కాంగ్రెస్ నేత చిమన్‌బాయ్ పటేల్ తొలి ఉప ముఖ్యమంత్రిగా 1972 నుంచి 73 వరకూ పనిచేశారు. పటేల్‌తో పాటు కాంగ్రెస్ మరో నేత కాంతిలాల్ ఘాయ్ ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి ఘన్‌శ్యామ్ ఓజా మంత్రివర్గంలో పనిచేశారు. మూడో ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత కేశూభాయ్ పటేల్ 1990 మార్చి నుంచి అక్టోబర్ నుంచి వరకూ అప్పటి సీఎం చిమన్‌భాయ్ పటేల్ ఆధ్వర్యంలో పనిచేశారు. పటేల్ సైతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1995 మార్చి నుంచి అక్టోబర్ వరకూ, తిరిగి 1998 మార్చి నుంచి 2001 వరకూ పనిచేశారు. 1994 ఫిబ్రవరి నుంచి 1995 మార్చి వరకూ కాంగ్రెస్ నేత నరహరి అమిన్ ఉపముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి ఛబిల్‌దాస్ మెహతా సారథ్యంలో పనిచేశారు. ఆ తర్వా నితిన్‌భాయ్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రభుత్వంలో 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకూ పనిచేశారు.
సంఘవి ఎవరు?
సంఘవి 2012లో మజురా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2017లోనూ ఆయన తన సీటును నిలబెట్టుకున్నారు. 2022 అసెంబ్లీలో ఆయన మరోసారి ఆప్ అభ్యర్థి పీవీఎస్ శర్మపై 1.16 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం
మంగళూరులోనూ శ్రీవారి ఆలయం.. భూమి మంజూరు చేసిన ప్రభుత్వం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి