KTR FIRES CM Revanth: రేవంత్‌కి దమ్ముంటే మంత్రుల అక్రమ నిర్మాణాలను తొలగించాలి: కేటీఆర్
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:55 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాలను 24 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు.
హైదరాబాద్, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్‌లో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. దమ్ముంటే తన 24 నెలల పరిపాలన చూపించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజల తీర్పుకోరాలని డిమాండ్ చేశారు. రేవంత్‌కి దమ్ముంటే మంత్రుల అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
తాను చేసింది ఏమీ లేకపోవడంతోనే రేవంత్‌రెడ్డి అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కంటే ముందే కాంగ్రెస్ ఓటమిని రేవంత్‌రెడ్డి అంగీకరించారని ఆక్షేపించారు. రేవంత్‌రెడ్డి పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల్లోని వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండం కాదని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు
ప్రైవేటు విద్యాసంస్థలు తమాషా చేస్తే తాటతీస్తా.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And Telugu News