Share News

Minister Ramanaidu: జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Nov 30 , 2025 | 03:20 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు.

Minister Ramanaidu: జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల
Minister Nimmala Ramanaidu

పశ్చిమగోదావరి, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. నర్సాపురం మండలం పీఎం లంక గ్రామంలో రూ. 12.50 కోట్లతో చేపట్టే నల్లిక్రీక్ పనులకు మంత్రి నిమ్మల ఇవాళ(ఆదివారం) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


తమ ప్రభుత్వంలో శ్రీశైలం ప్లoజ్ పూల్, సైడ్ వాల్ నిర్మాణాలకు రూ.200 కోట్లు, తుంగభద్ర గేట్లకు రూ. 54 కోట్లు, ధవలేశ్వరం బ్యారేజ్‌కు రూ. 150 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని తెలిపారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందిస్తున్న భృతిని రూ. 20 వేలకు పెంచామని వివరించారు. ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా రూ 12.50 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. నర్సాపురం తీరంలో నల్లి క్రీక్ తవ్వక పనులు చేపడతామని పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.


పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన..

ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటించారు. నరసాపురం మండలం వేములదీవిలో రూ 12.50 కోట్లతో చేపట్టిన నల్లి క్రీక్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉప్పుటేరు వీళ్లేందుకు పెద్ద బోటు ఎక్కారు మంత్రి నిమ్మల. పరిమితికి మించి ఎక్కువమందిని బోటుపై ఎక్కించడంపై మంత్రి ఫైర్ అయ్యారు. బోటులో సామర్థ్యానికి మించి జనం ఎక్కితే మునిగి పోదా అంటూ అధికారులను ప్రశ్నించారు మంత్రి నిమ్మల రామానాయుడు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?

Read Latest AP News and National News

Updated Date - Nov 30 , 2025 | 03:46 PM