MP Kalisetty Appalanaidu: ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:56 PM
ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. జగన్‌కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని విమర్శించారు.
ఢిల్లీ, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 16 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP Vizianagaram MP Kalisetty Appalanaidu) వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సీఎం చంద్రబాబు పాలనపై చాలా విశ్వాసంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతోందని.. మంచి ఫ్యూచర్ ఉందని ప్రధాని ప్రశంసించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన విందుకు తాను హాజరయ్యానని తెలిపారు. ప్రధాని తనను చూసి బాగున్నారా అని పలకరించారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నారని ప్రధానికి ధన్యవాదాలు చెప్పానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా తాను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివద్ధిపై ప్రధానికి ఉన్న అభిప్రాయాన్ని తెలియజేశారని అన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ప్రధాని మోదీని బీజేపీ ఎంపీలు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి బాగా పనిచేస్తోందని వారి ముందు ప్రస్తావించారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీల ముందు చంద్రబాబును ప్రశంసించడం అభినందనీయమని తెలిపారు. ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని హితవు పలికారు. జగన్‌కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దువ్వాడ మాధురి శ్రీనివాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News