Share News

Atchannaidu: కేంద్రంతో ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు.. వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు విసుర్లు

ABN , Publish Date - Jan 28 , 2025 | 08:47 PM

Kinjarapu Atchannaidu: విశాఖపట్నం రైల్వే జోన్‌కు స్థలం ఇవ్వలేని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి ఒట్టి చేతులతో వచ్చారంటూ కొందరు వైసీపీ నేతలు అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Atchannaidu: కేంద్రంతో ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు.. వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు విసుర్లు
Kinjarapu Atchannaidu

శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇవాళ(మంగళవారం) అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి రథసప్తమి వేడుకల ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి ఒట్టి చేతులతో వచ్చారంటూ కొందరు వైసీపీ నేతలు అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.దావోస్ పర్యటనకు ముందే రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని స్పష్టం చేశారు.


తమిళనాడుకు చెన్నై.. కర్ణాటకకు బెంగళూరు లాగా ఏపీకి చంద్రబాబే ఒక బ్రాండ్ అని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రైవేటైజేషన్ లిస్టులో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని అన్నారు. అమరావతిలో కట్టడాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఐరన్‌నే వాడాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత ఐదేళ్లు స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రంతో ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. విశాఖపట్నం రైల్వే జోన్‌కు స్థలం ఇవ్వలేని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.


వైసీపీని ప్రజలు వంద అడుగుల గొయ్యి తీసి పాతి పెడతారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందన్నారు. రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశారని నీతి ఆయోగే చెప్పిందని గుర్తుచేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు నిన్న చెబితే సూపర్ సిక్స్ పథకాలను దారి మళ్లించేందుకే మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: అప్పుడు కనబడలేదా ఆర్థిక భారం.. షర్మిల ఫైర్

Tirumala: తిరుమలకు ఇస్రో ఛైర్మన్.. గగన్‌యాన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

Nara Lokesh: ఉద్యోగుల కాళ్ల దగ్గర మంత్రి నేమ్ ప్లేట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 08:48 PM