MP Appalanaidu: జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలను తరిమేశారు.. కలిశెట్టి ఫైర్
ABN , Publish Date - Nov 15 , 2025 | 10:24 AM
రాష్ట్రంలోని ప్రజలు కూటమి ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని వివరించారు. ఈ సదస్సును సోషల్ మీడియాలో యువత కూడా స్వాగతిస్తూ భారీస్థాయిలో పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Telugu Desam Vizianagaram MP Kalisetty Appalanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. కానీ జగన్ అండ్ టీమ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఇవాళ(శనివారం)విశాఖపట్నం వేదికగా మీడియాతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడారు.పెట్టుబడులపై తమ ప్రభుత్వాన్ని విమర్శించడమే జగన్ అండ్ కో పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు.
మొదటగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తే దాన్ని దాటిపోతున్నాయని వివరించారు. జగన్ ఐదేళ్లు పెట్టుబడులను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. జగన్ హయాంలో రాష్ట్రం నుంచి పారిశ్రామిక వేత్తలను తరిమేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు సీఎం పదవి ముఖ్యం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే ముఖ్యమని ఉద్ఘాటించారు. ఈ రోజు కూడా మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ ఆలోచనతో మరింతమంది పెట్టుబడుదారులు ముందుకు వస్తున్నారని నొక్కిచెప్పారు.
రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని వివరించారు. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సును సోషల్ మీడియాలో యువత కూడా స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే పెట్టుబడులకు మద్దతుగా భారీస్థాయిలో యువత పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా వైసీపీ అండ్ కోకు జ్ఞానోదయం కలగాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పెట్టుబడులు ఏపీకి మరిన్ని రావాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
ఆర్ఐ సతీష్ కుమార్ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ
Read Latest AP News And Telugu News