Share News

RI Satish Kumar CASE: ఆర్ఐ సతీష్ కుమార్‌ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్‌ఐఆర్‌ కాపీ

ABN , Publish Date - Nov 15 , 2025 | 09:29 AM

తిరుపతి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే ఆయన మృతిపై సోదరుడు శ్రీహరి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 RI Satish Kumar CASE: ఆర్ఐ సతీష్ కుమార్‌ హత్య కేసు..  ఏబీఎన్ చేతిలో  ఎఫ్‌ఐఆర్‌ కాపీ
RI Satish Kumar CASE

తిరుపతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పరకామణి చోరీ కేసు (Tirupati Parakamani Theft Case)లో కీలక వ్యక్తి ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్ (RI Satish Kumar) మృతిపై తిరుపతి రైల్వే పోలీసులకు ఆయన సోదరుడు శ్రీహరి ఫిర్యాదు చేశారు. సతీష్ కుమార్‌ది హత్యేనని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదుపై BNS 103 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని వివరించారు. ఈ రైల్లో గుంతకల్లు నుంచి తిరుపతి వరకు A1 భోగి బెర్త్ నెంబర్ - 29‌ని ఆయన బుక్ చేసుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు.


అయితే, తాడిపత్రి మండలం కోమలి రైల్వే‌స్టేషన్ పట్టాల పక్కన విగత జీవిగా సతీష్ కుమార్ పడి ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు రైల్వే పోలీసులు. పరకామని కేసులో నిందితుల నుంచి తనకు ప్రాణహానీ ఉందని గతంలో ఆయన చెప్పారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు పోలీసులు. ఈ హత్య కేసుని గుంతకల్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. సతీష్ కుమార్ ప్రయాణం - మరణం మధ్య అసలు ఏమి జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్

జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలను తరిమేశారు.. కలిశెట్టి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 15 , 2025 | 10:33 AM