Share News

Minister Mandipalli Inspects ON RTC Bus Fire Accident : విశాఖలో ఆర్టీసీ బస్సుకు అగ్ని ప్రమాదం.. స్పందించిన మంత్రి మండిపల్లి

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:45 AM

విశాఖపట్నంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సమాచారాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంత్రి మండిపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.

Minister Mandipalli Inspects ON RTC Bus Fire Accident :  విశాఖలో ఆర్టీసీ బస్సుకు అగ్ని ప్రమాదం.. స్పందించిన మంత్రి మండిపల్లి
Mandipalli Inspects ON RTC Bus Fire Accident

విశాఖపట్నం, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): శాంతిపురం జంక్షన్‌లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి (RTC Bus Fire Accident) గురైంది. బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పుతున్నారు స్థానికులు. బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సమీపంలో ఓ పెట్రోల్ బంక్ ఉంది. షార్ట్ సర్క్యూటే ఈ అగ్ని ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


ఆర్టీసీ బస్సు ప్రమాదంపై స్పందించిన మంత్రి మండిపల్లి..

విశాఖలో ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సమాచారాన్ని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంత్రి మండిపల్లి పరిశీలించారు. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఆకస్మికంగా మంటలు అంటుకోవడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యారని తెలిపారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.


ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. ఘటనా స్థలంలో అధికారులు, పోలీసుల నుంచి పూర్తి వివరాలను మంత్రి సేకరించారు. ఈ ప్రమాదంపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సంఘటన స్థలం నుంచి ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావుతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని మంత్రి మండిపల్లి సమీక్షించారు. ఎలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ క్రీడాకారులకు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఆ అధికారిని విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై చింతా మోహన్ ఫైర్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 29 , 2025 | 11:58 AM