Share News

GVL Narasimha Rao: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:40 PM

GVL Narasimha Rao: ఏపీ అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్‌గా అక్టోబర్‌లో రూ.2800 కోట్లు అందజేశారని జీవీఎల్ నరసింహరావు అన్నారు.

GVL Narasimha Rao: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది
GVL Narasimha Rao

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ వరాన్ని ఇచ్చారని చెప్పారు.. ఈ సందర్భంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆంద్రప్రదేశ్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆంద్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని.. రైల్వే జోన్ కార్యరూపం దాల్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులు ఇస్తుందని జీవీఎల్ నరసింహరావు తెలిపారు.


అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్‌గా అక్టోబర్‌లో రూ.2800 కోట్లు అందజేశారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రాకు నిజంగా మంచి రోజులు వచ్చాయని తెలిపారు. గత ఏడు నెలల్లో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం శుభ పరిణామమని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో అత్యధిక ప్యాకేజీ స్టీల్ ప్లాంట్‌కి దక్కిందన్నారు. పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావన చేశానని జీవీఎల్ నరసింహరావు చెప్పారు.


వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆంద్రప్రదేశ్‌కు అన్ని రంగాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. కేంద్రం ఏపీపై ప్రత్యేక దృష్టి , ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని జీవీఎల్ నరసింహరావు తెలిపారు. సైబర్ క్రైమ్‌పై అహగహన కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. మహా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. సైబర్ నేరాలతో 10 రోజుల్లో రూ.10 కోట్లు కోల్పోయారని చెప్పారు. భారీ ఎత్తున సైబర్ నేరాలు చేస్తున్నారని తెలుస్తోందన్నారు. సామాన్యులు సంపాదించిన కొద్దిపాటి డబ్బును సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారని చెప్పారు. ఈ సైబర్ నేరాలు ఇంటర్నేషనల్ మాఫియా‌లా తయారైందని జీవీఎల్ నరసింహరావు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

NTR Death Anniversary:ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు: నందమూరి బాలకృష్ణ

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!

NTR Death Anniversary: తెలుగుదనానికి ప్రతిరూపం ఎన్టీఆర్ : మంత్రి నారా లోకేష్

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 18 , 2025 | 12:46 PM