YSRCP: జగన్ బర్త్ డే వేళ.. వైసీపీకి బిగ్ షాక్
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:06 PM
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజలను ఉత్సుకతకు గురిచేస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం వేళ తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు. ఈ సంఘటన వైసీపీకి భారీ షాక్ అని చెప్పొచ్చు.
శ్రీకాకుళం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జన్మదినోత్సవం వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో 3000 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వాగతం పలికారు.

వీరిలో పలువురు జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు ఉన్నారు. వీరి చేరిక టీడీపీకి మరింత బలాన్ని ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామస్థాయి రాజకీయాల్లో వీరి చేరికతో బలం పెరుగుతోందని టీడీపీ నేతలు కూడా అంటున్నారు. వైసీపీకి ఇది కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ కొత్త చేరికలు, 2024 ఎన్నికల కోసం ప్రత్యేకంగా టీడీపీకి మంచి ఫలితాలు అందించవచ్చని పేర్కొన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ బర్త్‌డే వేడుక.. వైసీపీలో బయటపడ్డ కుమ్ములాటలు..!
అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి
Read Latest AP News And Telugu News