Atchannaidu on Urea Shortage: ఏపీలో యూరియా కొరత.. మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:21 PM
మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే ఇంటింటికీ యూరియా ఇస్తామని వెల్లడించారు. రూ.300కంటే ఎక్కువకు యూరియా అమ్మితే చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
శ్రీకాకుళం, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరతపై అన్నదాతలు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) శ్రీకాకుళం రూరల్ మండలం తండెంవలస గ్రామంలో ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే, యూరియా పంపిణీ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
రైతులు ఏడాది అంతటికి ఒకేసారి నిల్వ చేసుకోవాలనే ఆలోచనతోనే యూరియా సమస్య తలెత్తిందని చెప్పుకొచ్చారు. ఎకరాకు 25 కేజీల యూరియా (Urea Shortage) వాడాలని సూచించారు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 25 కేజీల చొప్పున మూడు విడుతలుగా రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఇది వ్యవసాయ శాస్త్రజ్ఞుల సూచనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. దేశంలో దీనికి సంబంధించిన సర్వేలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచనలు చేశాయని వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఈ సంవత్సరం 70శాతం మార్క్‌ఫెడ్‌కు, 30 శాతం ప్రైవేట్ షాపులకు కేటాయించారని గుర్తుచేశారు. యూరియా రాదేమోనని మూడు విడతల్లో వేయాల్సిన దానిని ఒకేసారి అన్నదాతలు తీసుకుని నిల్వ చేయడంతోనే యూరియా సమస్య వచ్చిందని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. అవసరమైతే ఇంటింటికీ యూరియా ఇస్తామని వెల్లడించారు. రూ.300 కంటే ఎక్కువకు యూరియా అమ్మితే చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..
కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.. అసలు విషయమిదే..
Read Latest Andhra Pradesh News and National News