Share News

Anitha: రచ్చ చేయడానికే జగన్ నాటకాలు.. హోంమంత్రి అనిత ఫైర్

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:28 PM

Home Minister Anitha: ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి సాగు, స్మగ్లింగ్, కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని హెచ్చరించారు. ఫోక్సో కేసుల్లో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు.

Anitha: రచ్చ చేయడానికే జగన్ నాటకాలు..  హోంమంత్రి  అనిత ఫైర్
Home Minister Anitha

శ్రీకాకుళం: మాజీ సీఎం కాబట్టే జగన్మోహన్‌రెడ్డికి భద్రత ఇచ్చామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని చెప్పారు. వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. కేవలం రచ్చ చేయాలనే జగన్ నాటకాలు ఆడారని మండిపడ్డారు. ముందు సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నహెలికాప్టర్ .. పదినిమిషాల తర్వాత ఎలా గాలిలోకి ఎగిరిందని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో వైసీపీ నేతలు కావాలని నాటకాలు ఆడారని విమర్శించారు. ఇవాళ(బధవారం) విజయనగరం, మన్యం , శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులతో హోంమంత్రి అనిత రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు.ఇన్వెస్టిగేషన్‌లో సాంకేతికత వినియోగిస్తున్నామని తెలిపారు. ఎక్కడ గ్యాప్స్ లేకుండా చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత చెప్పారు.


ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉందని హోంమంత్రి అనిత అన్నారు. శ్రీకాకుళంలో నాలుగు కోట్ల ప్రాపర్టీని రికవరీ చేశామని తెలిపారు. పాడేరు, మన్యం వంటి ప్రాంతాల్లో గంజాయి సాగుని నివారించామని చెప్పారు. మాదకద్రవ్యాల కేసుల్లో మూలాలు కనుక్కొని, ఆస్తులు జప్తు చేస్తున్నామని అన్నారు. గంజాయి సాగు, స్మగ్లింగ్, కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఫోక్సో కేసుల్లో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నామని అన్నారు. డ్రోన్, సీసీ కెమెరాలు ఉపయోగిస్తూ నేరస్తులను పట్టుకుంటున్నామని చెప్పారు. ఈగల్ టీమ్, సంకల్ప ప్రోగ్రాం తీసుకుంటున్నామని అన్నారు. యాక్టివ్ రౌడీ షీటర్లపై నిఘా ఉంచామన్నారు. స్కూళ్ల వద్ద కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సైబర్ క్రైమ్ స్టేషన్ జిల్లాకు ఒక స్టేషన్ పెట్టాలని అనుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.


కేన్సర్ బాధితురాలు లతశ్రీ ఇంటికి హోంమంత్రి అనిత

కేన్సర్ బాధితురాలు లతశ్రీ ఇంటికి హోంమంత్రి అనిత బుధవారం నాడు వెళ్లారు. ఇటీవల హోంమంత్రికి వీడియో కాల్ చేసి తమను కలవాలని ఉందని శ్రీకాకుళానికి చెందిన లతశ్రీ చెప్పారు. ధైర్యంగా ఉండండి... త్వరలో మిమ్మల్ని కలుస్తానని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా కేన్సర్ పేషెంట్ లత శ్రీ ఇంటికి హోం మంత్రి అనిత వెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి

Trump China Tariffs: చైనాపై ట్రంప్‌ బాదుడు 104 శాతానికి!

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Big Shock To Kakani: కాకాణి బెయిల్.. నో చెప్పిన హైకోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 04:44 PM