PM Modi On GST Meeting: నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభ ప్రారంభం.. పాల్గొన్న ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 16 , 2025 | 03:21 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
కర్నూలు, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ సభకు భారీగా ప్రజలు, కూటమి శ్రేణులు తరలివచ్చారు. ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉన్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీకి శివుడి జ్ఞాపికను బహుకరించారు సీఎం చంద్రబాబు. మోదీని శాలువతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సత్కరించారు ప్రధానికి ఆంజనేయస్వామి జ్ఞాపిక అందజేశారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కాసేపట్లో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రూ.9,449 కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.2,279 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ.