Share News

PM Modi ON AP Schedule: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు.. వివరాలివే..

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:52 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 16వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు.

PM Modi ON AP Schedule: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు.. వివరాలివే..
PM Narendra Modi ON AP Schedule

కర్నూలు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 16వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు ప్రధాని మోదీ. 16వ తేదీన ఉదయం 10:20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అనంతరం హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు బయలు దేరుతారు.


అక్కడ నుంచి ఉదయం 11:10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కి చేరుకోనున్నారు ప్రధాని. 16వ తేదీన ఉదయం 11:45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సున్నిపెంటలో హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు బయలుదేరనున్నారు.


మధ్యాహ్నం 2:30 గంటలకు రాగ మయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం రాగమయూరి గ్రీన్ హిల్స్‌లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

దేవలంపేట అంబేద్కర్ ఘటన.. ఏపీ ప్రభుత్వం చర్యలు

జగన్ స్కాంలు ఏపీ నుంచి ఆఫ్రికా వరకు.. ఎమ్మెల్యే గోరంట్ల సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 03:32 PM