Share News

PM Modi On Srisailam Visit: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:16 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 16వ తేదీన శ్రీశైలంలో పర్యటించనున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రధాని మోదీ తొలిసారిగా రానున్నారు.

PM Modi On Srisailam Visit: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. అధికారులకు  కీలక ఆదేశాలు
PM Modi On Srisailam Visit

అమరావతి, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Minister BC Janardhan Reddy) ఈ నెల 16వ తేదీన శ్రీశైలం (Srisailam Visit)లో పర్యటించనున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రధాని మోదీ తొలిసారిగా రానున్నారు. దేవాతామూర్తులకు ప్రధాని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కర్నూలు జిల్లా కలెక్టర్‌తో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ.సిరి, జిల్లా ఆర్ అండ్ బీ శాఖ ఎస్ఈ, ఈఈలకి పలు సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.


ప్రధాని మోదీ పర్యటన వేళ జాగ్రత్త వహించాలి: మంత్రి జనార్దన్ రెడ్డి

bc-janardhan-reddy.jpg

ప్రధాని మోదీ పర్యటన వేళ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఆర్ అండ్ బీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆర్ అండ్ బీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.


జాతీయ రహదారుల్లో అకస్మాత్తుగా ట్రాఫిక్ స్థంభించిపోయే సమస్యలను అధిగమించేందుకు.. ప్రత్యామ్నాయంగా ఎస్కేప్ రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో, స్థానికంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మార్గనిర్దేశం చేశారు. శ్రీశైలంలో స్థానికంగా రహదారుల మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే, ఇతర జిల్లాల ఆర్ అండ్ బీ శాఖ అధికారులను వినియోగించుకుని, సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకి బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా సిట్ పిటిషన్

పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్.. ఎందుకంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 12:27 PM