Share News

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:44 PM

కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.

 Kurnool Bus Accident:  కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు
Kurnool Bus Accident

కర్నూలు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా (Kurnool District)లోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఇవాళ(శుక్రవారం) బస్సు ప్రమాదం (Bus Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు (Kurnool District Police) కేసులు నమోదు చేశారు. ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు.‌ ఇప్పటికే ఆ బస్సుకి చెందిన ఒక డ్రైవర్ శివ నారాయణ పోలీసుల అదుపులో ఉన్నారు.


అయితే, పరారీలో మరో డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్య ఉన్నారు. ముత్యాల లక్ష్మయ్యపై 125/Aతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికుల మృతికి కారణమయ్యారని కావేరి బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై పోలీసులు కేసులు పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఐజీ కోయ ప్రవీణ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.


కాగా, కర్నూలు జిల్లాలో ఇవాళ(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు చిన్నటేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బైక్ ఢీకొనడంతో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు, ఒక బైకర్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులకి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..

బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 07:04 PM