YS Sharmila Slams Jagan: బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 08:35 PM
తన బిడ్ట ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని షర్మిల స్పష్టం చేశారు. తన కొడుకు రాజకీయ ప్రవేశంపై వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా, బెదురా? అని ఎద్దేవా చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు.. అందుకే ఆయన చెప్పినట్లు ఆడుతున్నాడని ఆమె ఆరోపించారు. వైఎస్సార్ మరణం వెనక రిలయన్స్ ఉందన్న జగన్.. మోదీ వల్లే వారికి రాజ్యసభ ఇచ్చారని విమర్శించారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా..? అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఇవాళ(గురువారం) మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోదీతో మాజీ సీఎం జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. జగన్‌కు అసలు ఐడియాలజీ మిగిలి ఉందా.. లేకపోతే బీజేపీ ఐడియాలజీనే వైసీపీ అనుసరిస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగానే జగన్ ఉన్నారని ఆరోపించారు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెబుతారో చెప్పాలని మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే బీజేపీకి వైసీపీ తోక పార్టీ, తొత్తు పార్టీ అని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన చేతి మీద బీజేపీ పచ్చ బొట్టు వేసుకోవాలని ఎద్దేవా చేశారు.
తన బిడ్ట ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని షర్మిల స్పష్టం చేశారు. తన కొడుకు రాజకీయ ప్రవేశంపై వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా, బెదురా? అని ఎద్దేవా చేశారు. తన కొడుకుకు వైఎస్ రాజారెడ్డి అని వైఎస్సార్ పేరు పెట్టారని గుర్తు చేశారు. తన బిడ్డ వైఎస్సార్ వారసుడే.. అని తేల్చి చెప్పారు షర్మిల. ఎవరెన్ని వాగినా అది ఎవరూ కాదనలేని నిజమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను దూరం పెట్టిన నేత వైఎస్సార్ అని తెలిపారు. తన తండ్రి బతికి ఉంటే జగన్ చేసిన పనికి తలదించుకునే వారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం