Share News

TG Rain Alert: మరోసారి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:27 PM

నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

TG Rain Alert: మరోసారి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
Rain Alert..

హైదరాబాద్: నగరంలో మరోసారి వర్షం మొదలైంది. ఇవాళ(గురువారం) నగరంలోని పలు చోట్ల ఇప్పటికే కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితికి చేరుకున్నాయి. పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్​, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీనగర్, పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం పడింది. ఉదయం నుంచీ ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.


నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూసఫ్​గూడ, మధురానగర్​, అమీర్​పేట్​, ఎస్ఆర్​ నగర్​, ఎర్రగడ్డ, సనత్​ నగర్​, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్​ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఈ వర్షాలు మొదలయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఇవాళ (గురువారం) వర్షం కురిసింది. ఆదిలాబాద్​, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్​, నిజామాబాద్​, రాజన్న సిరిసిల్ల, జయశంకర్​ భూపాలపల్లి, మహబూబాబాద్​, సిద్దిపేట, మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Updated Date - Sep 11 , 2025 | 04:32 PM