Yamini Sharma Fires On Sharmila: షర్మిలా మతి తప్పి మాట్లాడటం మానుకో.. యామిని శర్మ స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:49 PM
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల మతి తప్పి మాట్లాడటం మానుకోవాలని యామిని శర్మ హితవు పలికారు.
విజయవాడ, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)కి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ (Yamini Sharma) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల మతి తప్పి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. GST 2.0 అనేది గబ్బర్ సింగ్ ట్యాక్స్ కాదని.. గ్రేట్ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అని అభివర్ణించారు. ఇవాళ(బుధవారం) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు యామిని శర్మ.
జీఎస్టీ 2.0.. భారత్ ఆర్థిక స్వావలంబనకు పునాది అని ఉద్ఘాటించారు. జీఎస్టీపై షర్మిల మాట్లాడింది అర్థం లేని రాజకీయ పిచ్చి ప్రచారం మాత్రమేనని ధ్వజమెత్తారు. జీఎస్టీ 2.0 సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించి.. చిన్న వ్యాపారాలకు సులభతరం చేస్తూ, రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వాతంత్య్రం ఇస్తోందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కి ఇవి ఎందుకు కనిపించవని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకి అభివృద్ధి కన్నా అబద్ధాల మీద రాజకీయాలు చేయడం అలవాటని విమర్శించారు యామిని శర్మ.
ప్రత్యేక హోదా పేరు చెప్పి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్‌నేనని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు లేదని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి హోదాని ఆచరణలో చూపిస్తోందని స్పష్టం చేశారు. కర్నూలులో జరుగబోయే జీఎస్టీ 2.0 ఉత్సవం కేవలం సభ కాదని.. ఇది రాష్ట్ర ఆర్థిక శక్తి పునరుద్ధరణ వేడుక అని అభివర్ణించారు. ఈ సభలో ప్రజలతో కలిసి ఆర్థిక సంస్కరణల సంబురాలు చేయాలని యామిని శర్మ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News