Home » Sadineni Yamini
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల మతి తప్పి మాట్లాడటం మానుకోవాలని యామిని శర్మ హితవు పలికారు.
ఐదేళ్ల జగన్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తుంటే.. జగన్ చూసి తట్టుకోలేకపోతున్నారని యామిని శర్మ మండిపడ్డారు.
Sadhineni Yamini: మహిళలు, రైతులు, శ్రామికులకు ఆసరా ఇచ్చే బడ్జెట్ ఇది అని.. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఆలోచన చేశారని బీజేపీ నేత సాధినేని యామిని అన్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారన్నారు. మహిళలకు 4 లక్షల కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్‌లో కేటాయించారని.. ఏపీకి సంబంధించి పోలవరం, రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో 200కు పైగా ఆలయాలు ధ్వంసం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఆలయాల ధ్వసంపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమలోని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల్లో బలగాలని పెంచాలని ఎన్నికల సంఘాన్ని (Election Commission) బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని (Sadineni Yamini) కోరారు. ఆదివారం కూటమి పక్షం బీజేపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను యామిని, కూటమి పక్షం బీజేపీ నేతలు కలిశారు.
విజయవాడ: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం అసలు ఏమి చేసింది?. ప్రజల సంక్షేమం గురించి ఏమి చేసింది?.. పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర స్థాయిలో విమర్శించారు.