AP Liquor Sales: మద్యం దుకాణాల వద్ద సర్కార్ నయా రూల్స్.. ఇవి పాటించాల్సిందే
ABN , Publish Date - Oct 15 , 2025 | 03:59 PM
ప్రతి దుకాణం, బార్‌ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ‘ఇక్కడ విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది, నాణ్యమైనదని ధృవీకరించాం’ అని బోర్డులు పెట్టాలని నిబంధనల్లో తెలిపింది.
అమరావతి, అక్టోబర్ 15: రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నిజమైన, నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది సర్కార్. నకిలీ మద్యం నివారణకు పలు నిబంధనలను ఎక్సైజ్ శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రతి మద్యం బాటిల్‌ను క్యూర్ ఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే దుకాణం, బార్ యజమానులు అమ్మాలని నిబంధన విధించింది. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను తప్పని సరిగా స్కాన్ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. ప్రతి దుకాణం, బార్‌ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ‘ఇక్కడ విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది, నాణ్యమైనదని ధృవీకరించాం’ అని బోర్డులు పెట్టాలని నిబంధనల్లో తెలిపింది.
వినియోగదారులకు విక్రయించే ముందు, అమ్ముతున్న ప్రతి మద్యం బాటిల్ ప్రామాణికతను ధృవీకరించాలని నిబంధన విధించింది ప్రభుత్వం. మద్యం బాటిల్‌పై సీల్, క్యాప్, హోలోగ్రామ్ స్ధితి, ప్రామాణికతను తనిఖీ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. ప్రతి దుకాణం, బార్‌లో ‘డైలీ లిక్కర్ జెన్యునైనెస్ వెరిఫికేషన్ రిజిస్టర్’ అమలు చేయాలని ఆదేశించింది. రిజిస్టర్‌లో అమ్మిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్ నంబర్,రిజిస్టర్లో నమోదు చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. క్యూఆర్ కోడ్ తనిఖీ చేసిన సమయం, స్టాంప్, స్టేటస్ ఫలితాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా రియల్ టైమ్ డేటాలో ప్రదర్శించాలని నిబంధన పెట్టారు. ఎక్సైజ్ సిబ్బంది ప్రతి రోజూ మద్యం దుకాణం, బార్లలో ర్యాండం విధానంలో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తనిఖీల వివరాలను దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేసి ఎక్సైజ్ అధికారి రోజూ సంతకం చేయాలని పేర్కొంది. డిపో నుంచి మద్యం స్టాక్ అందిన తర్వాత, ప్రతి షాప్, బార్‌లో ప్రతి సరకులోని కనీసం 5 శాతం బాటిళ్లను స్కాన్ చేయాలనే నిబంధనను విధించింది. బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్‌పై లైసెన్స్‌దారు సంతకం చేయాలని నిబంధనల్లో పేర్కొంది. సర్టిఫికెట్‌ను డైలీ లిక్కర్ జెన్యూన్‌నెస్ వెరిఫికేషన్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని.. తనిఖీల్లో నకిలీ మద్యం కనుక్కుంటే వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారి లేదా లైసెన్సు దారుడు నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయకపోతే నకిలీ మద్యానికి సహకరించడం, నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించాలని తెలిపింది.
నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్సు రద్దు చేయడం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సర్కార్. నకిలీ మద్యంపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు పనిచేసే పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని.. కంట్రోల్ రూం, వాట్సప్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహించాలని.. ఫిర్యాదులను 24 గంటల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ ఎండీ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
డబుల్ ఇంజిన్ కాదు.. బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం..
బుల్డోజర్లతో విధ్వంసమే కాదు.. మంచి పనీ చేయొచ్చు
Read Latest AP News And Telugu News