Share News

YSRCP MP Mithun Reddy: మరోసారి కోర్టుకు మిథున్‌రెడ్డి.. ఎందుకంటే..

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:13 AM

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితులకు బుధవారం రిమాండ్‌ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో మిథున్‌రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.

YSRCP MP Mithun Reddy: మరోసారి కోర్టుకు మిథున్‌రెడ్డి.. ఎందుకంటే..
YSRCP MP Mithun Reddy

రాజమండ్రి, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో (AP Liquor Scam Case) నిందితులకు ఈరోజుతో రిమాండ్‌ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని (YSRCP MP Mithun Reddy) విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు ఇవాళ (బుధవారం) తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో మిథున్‌రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. అయితే, లిక్కర్ స్కామ్ కేసులో రెండోసారి విధించిన రిమాండ్ గడువు ముగియడంతో ఇవాళ మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు.


రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో ఎస్కార్ట్ పోలీసులు విజయవాడకు తీసుకువచ్చారు. గత నెల(జులై) 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు ఎంపీ మిధున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డితో సహా మరో ముగ్గురి బెయిల్ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వెల్లడించనున్నది. మిథున్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద బారికేడ్లతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: లోకేశ్‌

గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 11:18 AM