పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: లోకేశ్
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:39 AM
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ రాష్ట్ర మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత అక్కడి ప్రజలంతా నిర్భయంగా...
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ రాష్ట్ర మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత అక్కడి ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్న పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదన్న విషయాన్ని వైసీపీ తెలుసుకోవాలని ఓ ప్రకటనలో సూచించారు.