Share News

గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా

ABN , Publish Date - Aug 13 , 2025 | 06:41 AM

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా

ఇంటర్నెట్ డెస్క్: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అక్కడ సుమారు 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని, ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలుస్తుందని చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గతంలో నామినేషన్‌ వేయాలన్నా ప్రాణభయం ఉండేదని.. ఈసారి అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు జడ్పీటీసీ స్థానాల్లో 11 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ఇది వైసీపీ లక్కీ నంబరని ఎద్దేవాచేశారు. ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, ఆమె వారి హయాంలోనే నియమితులయ్యారన్న విషయాన్ని గుర్తుచేశారు.

Updated Date - Aug 13 , 2025 | 06:42 AM