Share News

Minister Nara Lokesh: మంత్రి లోకేష్ కృషి.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:48 PM

ట్రిపుల్‌ ఐటీల్లో మెస్‌ నిర్వహణ బాధ్యతను అక్షయపాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ అప్పగించారు. లోకేష్ తన మాటనిలబెట్టుకున్నారని విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

Minister Nara Lokesh: మంత్రి లోకేష్ కృషి.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం
Minister Nara Lokesh

అమరావతి, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): ట్రిపుల్‌ ఐటీల్లో మెస్‌ నిర్వహణ బాధ్యతను అక్షయపాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ (Minister Nara Lokesh) అప్పగించారు. లోకేష్ తన మాటనిలబెట్టుకున్నారని ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు. ఇటీవల నూజివీడు ట్రిపుల్‌ ఐటీ (Nuzvid Students)లో భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే, అక్షయపాత్ర ద్వారా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.


అక్షయపాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందుతోండటంతో సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు. తమ సమస్య పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ కృషి చేశారని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అభినందనలు తెలిపారు. అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనాలతో ఇప్పుడు నిజమైన మార్పు కనిపిస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకి బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా సిట్ పిటిషన్

పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్.. ఎందుకంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 12:55 PM