Share News

NTR PMAY Housing Scheme: ఎన్టీఆర్-పీఎంఏవైపై నీలినీడలు

ABN , Publish Date - Aug 13 , 2025 | 06:56 AM

ఎన్టీఆర్- పీఎంఏవై(నందమూరి తారక రామారావు- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) ఇళ్లకు మోక్షం కలగటం లేదు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటంలో అంతులేని తాత్సారం జరుగుతోంది. దీంతో ఇళ్లు కట్టుకోలేక ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

NTR PMAY Housing Scheme: ఎన్టీఆర్-పీఎంఏవైపై నీలినీడలు
NTR PMAY Housing Scheme

» 2025-26 ఆర్థిక సంవత్సరం లక్ష్యం 2 లక్షల ఇళ్లు

» ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి వచ్చిన దరఖాస్తులు 70 వేలు

» ఆరు నెలలైనా మంజూరు కాని జాబితాలు

» పనులు మొదలు పెట్టలేని దైన్యస్థితిలో లబ్ధిదారులు

» 2014- 2019 నాటి గృహ లబ్ధిదారులకు తప్పని అవస్థలు

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్-పీఎంఏవైపై (NTR PMAY Housing Scheme) నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇళ్ల నిర్మాణాల లక్ష్యం రెండు లక్షలుగా నిర్దేశించుకున్న అధికారులు ఇప్పటి వరకు 70 వేల దరఖాస్తులు వస్తే ఒక్కదానికీ కూడా అనుమతి ఇవ్వలేదు. పనులు మొదలు పెట్టలేక ఆరు నెలలుగా లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గుడ్లవల్లేరు): ఎన్టీఆర్- పీఎంఏవై(నందమూరి తారక రామారావు- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) ఇళ్లకు మోక్షం కలగటం లేదు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటంలో అంతులేని తాత్సారం జరుగుతోంది. దీంతో ఇళ్లు కట్టుకోలేక ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్-పీఎంఏవై గ్రామీణ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎన్టీఆర్, రెండు లక్షల గృహాల వరకు లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటి వరకు 70 దరఖాస్తులు చేసుకున్నారు.


ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మంజేరు రాకపోవడంతో ఈ ఇళ్ల నిర్మాణాల విషయంలో గందరగోళం తలెత్తుతోంది. పీఎంఏవై ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం రూ.1.80 రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ మైనారిటీలకు రూ.50 వేలు అదనంగా సహాయం చేయాలని నిర్ణయించింది. అంటే మొత్తంగా రూ.2. 30 లక్షలు అవుతోంది. అదే ఎస్టీలకు రూ.75 వేలు ఆర్థిక సహాయం అదనంగా చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ లెక్కన మొత్తం రూ.2.55 లక్షల సహాయం లబ్ధిదారులకు వస్తుంది. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మంజూరు చేయకపోవటంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటోంది. అనుమతి వస్తే ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టుకోవచ్చని ఎంతోమంది లబ్ధిదారులు భావిస్తున్నారు.


దశల వారీగా ఫొటోల అప్లోడ్ సమస్య

ఇళ్లకు దశల వారీగా అంటే ఇళ్లు గ్రౌండింగ్ పనుల నుంచి పిల్లర్లు గోడలు, స్టాట్ పూర్తి చేసే వరకు వివిధ దశల్లో నిర్మాణ స్థాయిని తెలిపేలా ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జియో ట్యాగింగ్ లేకుండా ఇలా దశల వారీగా చేపట్టే పనులను ఫొటోలు తీయటం సాధ్యం కాదు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్న ఉద్దేశ్యంతో మంజూరు వచ్చి, జియో ట్యాగింగ్ చేసే వరకు ఇళ్లు కట్టుకోవద్దని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇళ్ల పనులు మొదలు పెట్టిన వారంతా ఎక్కడికక్కడ పనులు నిలుపుదల చేశారు. గతంలో కూడా ఈ విధానం అమల్లో ఉన్న హౌసింగ్ అధికారులు ఆయా స్టేట్‌లలో ఫొటోలు తీసుకునేవారు మంజూరు ఆర్డర్ వచ్చిన తర్వాత నిర్ణీత క్రమంలో దశల వారీగా వాటిని అప్లోడ్ చేసి బిల్లులు పెట్టేవారు ప్రస్తుతం ఈ విధానం లేకపోవటంతో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టనీయటం లేదు.


2019-2024 &.. మరి 2014 - 2019 మాటేమిటి?

గత టీడీపీ ప్రభుత్వంలో 2014 - 2019 కాలంలో పీఎంఏవై గ్రామీణ ఇళ్లకు అనుమతి ఇచ్చింది. అప్పట్లో చేపట్టిన వేల సంఖ్యలో ఇళ్లకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. కొన్ని నిర్మాణాలు ఇప్పటికీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. వీటిని పూర్తి చేయటానికి సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-2024 మధ్య చేపట్టిన పీఎంఏవై ఇళ్లకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న వాటికి అదనంగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందిస్తు న్నారు. 2014 -2019 నాటి ఇళ్లకు కూడా అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.


నేడు జియో ట్యాగింగ్ చేస్తేనే పనులు

రాష్ట్ర ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి నిబంధనలు మార్చింది. లబ్ధిదారులందరినీ ఖచ్చితంగా జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. జియో ట్యాగింగ్, చేయాలంటే ప్రభుత్వం మంజూరు ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి రాకుండా జియో ట్యాగింగ్ చేయటం సాధ్యం కాదు. దీంతో ఇళ్ల పనులు ప్రారంభించమని, అర్హులైన లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులు చెప్పట్లేదు.


గతంలో దరఖాస్తు చేసిన వెంటనే పనులు

పీఎంఏవై ఇళ్ల కోసం గతంలో ప్రజలు దరఖాస్తులు చేసిన తర్వాత హౌసింగ్ శాఖ పరిధిలో వారి అర్హతలను నిర్ణయించి అర్హులైన వారిని ఆన్‌లైన్ చేసేవారు. దీని ప్రకారం వారికి మంజూరు వచ్చినా.. రాకపోయినా, ముందు ఇళ్ల పనులు మొదలు పెట్టుకోమని చెప్పేవారు. దీంతో లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేవారు. తర్వాత మంజూరు వచ్చినపుడు ఆ ఇళ్ల నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో హౌసింగ్ అధికారులు పరిశీలించి దానికి తగినట్లుగా బిల్లులు విడుదల చేసేవారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: లోకేశ్‌

గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 06:59 AM