Obuladevaracheruvu: ఓ తల్లి ప్రేమ పాశం
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:56 AM
పెళ్లయిన ఆరు నెలలకే భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో విష గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. వైద్యంతో అతడి ప్రాణాలు నిలబడ్డాయేగానీ...
మతిస్థిమితం కోల్పోయిన కొడుకు.. దిక్కుతోచక బంధించిన తల్లి
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
ఓబుళదేవరచెరువు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పెళ్లయిన ఆరు నెలలకే భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో విష గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. వైద్యంతో అతడి ప్రాణాలు నిలబడ్డాయేగానీ మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో కనిపించిన వారినల్లా దూషించడం, దాడికి ప్రయత్నిస్తుండటంతో ఆం దోళన చెందిన తల్లి.. దిక్కుతోచని పరిస్థితుల్లో కొడుకును సంకెళ్లతో బంధించి కాపాడుకుంటూ వస్తోం ది. వృద్ధాప్యంలో తనను చూసుకోవాల్సిన కొడుక్కి.. అన్నీ తానే అ యి.. వేళకు కడుపు నింపుతూ, మ లమూత్ర విసర్జనకు సాయ పడు తూ.. చంటి బిడ్డను చూసుకుంటున్నట్లు చూసుకుంటోంది. కటిక పేదరికంలో ఉన్న ఆమె.. తన కొడుకు వైద్యం కోసం దాతలు కరుణించాలని కన్నీళ్లతో వేడుకుంటోంది. శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం ఉగ్గిరెడ్డిపల్లికి చెందిన సరోజమ్మ కొడుకు రమే్‌షకు కర్ణాటకకు చెందిన గీతతో 8ఏళ్ల క్రితం క్రితం వివాహమైంది. ఆరు నెలలకే భార్య పుట్టింటికి వెళ్లిపోగా, విష గుళికలు మింగా డు. తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్, రేషన్ బియ్యమే ఇప్పుడు వారికి ఆసరా. దాతలు ఆర్థిక సాయాన్ని ‘గుత్తా సరోజమ్మ, ఆంధ్ర ప్రగతి బ్యాంకు, ఖాతా నంబరు: 91006229142, ఐఎఫ్ఎస్‌సీ కోడ్:ఏపీజీబీ0001045,’కు అందించవచ్చు. నేరుగా సంప్రదించేవారు 8897239340కు ఫోను చేయొచ్చు.