YSRCP Leaders Cases: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ నేతలపై కేసులు నమోదు
ABN , Publish Date - Sep 19 , 2025 | 09:53 PM
మచిలీపట్నం పోలీసు స్టేషన్‌లో 40 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో సహా సుమారు 40 మందిపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం పోలీసు స్టేషన్‌లో 40 మంది వైసీపీ నేతలపై కేసులు (YSRCP Leaders Cases) నమోదయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో సహా సుమారు 40 మందిపై కేసులు నమోదు చేశారు మచిలీపట్నం పోలీసులు (Machilipatnam Police).
అనుమతులు లేకపోయినా ఇవాళ(శుక్రవారం) ఛలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారని మచిలీపట్నం పోలీసులు తెలిపారు. పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా భారీ ఎత్తున జనసమీకరణ జరిపి మెడికల్ కాలేజ్ వద్ద నిరసనకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. ఈ కారణంతోనే వైసీపీ నేతలపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.175కోట్ల విలువైన బంగారు నాణేలు ఎవరి కోసం?.. బ్లాక్ మనీని వైట్‌గా మార్చి..
జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు
Read Latest AP News And Telugu News