Minister Savita ON Durgamma Temple: కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఏపీ ప్రజలపై ఉండాలి: మంత్రి సవిత
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:20 AM
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
విజయవాడ, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ ( Vijayawada Indrakiladri Kanaka Durgamma Temple) అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత (AP Minister Savita) ఇవాళ(ఆదివారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి సవితకి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. కొండపై ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను పరిశీలించారు. మంత్రి సవితకు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు దేవస్థాన అధికారులు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఏపీ ప్రజలపై కనక దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. నేటి నుంచి దర్శన టిక్కెట్లు లేకుండా భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు మంత్రి సవిత. ఏర్పాట్లు, సౌకర్యాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు.

మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక పూజలు
అలాగే, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలోని కృష్ణమ్మకు పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఏపీ సుభీక్ష్యంగా ఉండాలని వేడుకున్నారు మంత్రి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా రాష్ట్రాభివృద్ధి జరిగి స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారం కావాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రార్ధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన అరకు కాఫీ.. సీఎం చంద్రబాబు అభినందనలు
తిరుమలలో గరుడ సేవకు భారీగా భక్తులు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
Read Latest AP News And Telugu News