APSRTC: ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 14 , 2025 | 07:39 AM
కూటమి ప్రభుత్వం మహిళలకు 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురు కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కడప రీజియన్ పరిధిలోని బస్సులను పూర్తి సన్నద్ధం చేశామని ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు.
» ఉచిత ప్రయాణానికి సర్వం సిద్ధం
» ఆర్టీసీ ఆర్ఎం గోపాల్‌రెడ్డి
కడప మారుతీనగర్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మహిళలకు 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని (women’s Free Travel Scheme) చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురు కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కడప రీజియన్ (Kadapa Region) పరిధిలోని బస్సులను పూర్తి సన్నద్ధం చేశామని ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి (Andhrajyothy) అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఫటాఫట్ సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న: కడప రీజియన్‌లో ఎన్ని బస్సులున్నాయి.
జవాబు: మొత్తం 616 బస్సులున్నాయి. ఇందులో పల్లెవెలుగు 290, అల్ట్రా పల్లెవెలుగు 59, ఎక్స్‌ప్రెస్‌లు 113, సూపర్ లగ్జరీలు 105, అల్ట్రా డీలక్స్ 30, స్టార్నర్ 4, ఇంద్ర 11, అమరావతి 4 ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు రూ.90లక్షల ఆదాయం ఉంది.
ప్రశ్న: ఉచిత ప్రయాణానికి ఎన్ని బస్సులు సిద్ధం చేశారు
జవాబు: పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు సౌలభ్యం కలదు. వీరికోసం 462 బస్సులు సిద్ధంగా ఉన్నాయి.
ప్రశ్న: బస్సులను ఏ రకంగా సిద్ధం చేశారు
జవాబు: రెండు నెలలుగా రీజియన్‌లోని అన్ని బస్సుల కండీషన్లను మెరుగుపరిచాం. మార్గమధ్యంలో బస్సులు ఆగిపోకుండా పూర్తిస్థాయిలో సిద్ధం చేశాం. బస్సు టైర్లు, స్టీరింగ్, బ్రేకుల కండీషన్లు సరిచేశాం.
ప్రశ్న: ఈ బస్సుల్లో రోజుకు ఎంతమంది ప్రయాణిస్తున్నారు.
జవాబు: దాదాపు లక్షా 51వేల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 60,400 మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. ఉచిత బస్సుల వల్ల మహిళా ప్రయాణికులు మరో 24,100 మంది పెరిగే అవకాశం ఉంది.
ప్రశ్న: ఏఏ రూట్లలో ఎక్కువమంది ప్రయాణం చేసే విలుంది
జవాబు: కడప- ప్రొద్దుటూరు, కడప-పులివెందుల, కడప-రాయచోటి, కడప-బద్వేలు రూట్లలో మహిళలు ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రశ్న: మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగితే ఏం చేస్తారు.
జవాబు: అదనంగా పాఠశాల, కళాశాలలకు వెళ్లే 28 బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేశాం.
ప్రశ్న: డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఉందా
జవాబు: రీజియన్ పరిధిలో డ్రైవర్ల కొరత ఉంది. దీన్ని అధిగమించేందుకు వీలుగా ఇటీవల దాదాపు 133 ఆన్కాల్ డ్రైవర్లను తీసుకున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది
జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి
For More AndhraPradesh News And Telugu News