Online Betting Gang: ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. ఆరుగురు అరెస్ట్
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:02 PM
ఆన్‌లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. పొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఆరుగురు బెట్టింగ్ ముఠా సభ్యులని బుధవారం అరెస్టు చేశారు కడప జిల్లా పోలీసులు.
కడప, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ (Online Betting Gang) నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు (Kadapa Police). పొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ (Online Cricket Betting)కి పాల్పడుతున్న ఆరుగురు బెట్టింగ్ ముఠా సభ్యులని ఇవాళ(బుధవారం) అరెస్టు చేశారు. ఈ క్రమంలో బెట్టింగ్ ముఠా సభ్యులపై బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఆరుగురు క్రికెట్ బుకీల దగ్గరి నుంచి రూ. 6.28 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ బుక్‌లని స్వాధీనం చేసుకున్నారు కడప జిల్లా పోలీసులు.
ఈ కేసుకి సంబంధించిన వివరాలను మీడియాకు కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ (SP Nachiketh Vishwanath) వెల్లడించారు. బెట్టింగ్ ముఠా సభ్యులని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీగా ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయిస్తూ బెట్టింగ్ వెబ్‌సైట్‌కు లింక్ చేసి, క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఆర్థిక నేరాలకు బెట్టింగ్ ముఠా సభ్యులు పాల్పడుతున్నారు. ఆసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వెబ్‌సైట్, యాప్‌లపై గట్టి నిఘా ఉంచామని కడప ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటి వారైనా తమ నిఘా నుంచి తప్పించుకోలేరని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
భారీ పెట్టబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News