Share News

YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:24 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. ప్రజా ఆస్తికి నష్టం కలిగించారనే కారణంతో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు
YSRCP key Leaders Notices

పల్నాడు జిల్లా: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఇవాళ(ఆదివారం) నోటీసులు ఇచ్చారు. పీడీపీపీ యాక్ట్ (ప్రజా ఆస్తికి నష్ట నిరోధక చట్టం) కింద నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు పేర్కొన్నారు.


ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేసి ప్రజలు, స్కూల్స్, ఆస్పత్రులకు ఇబ్బంది కలిగించిన అంశంలో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర్, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేశ్ రెడ్డి, గొపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, దేవినేని అవినాశ్, తదితర నేతలపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. నోటీసులు అందడంతో పోలీస్ స్టేషన్‌కి అన్నాబత్తుని శ్రావణ్, గజ్జల బార్గవ్ రెడ్డి వెళ్లారు.


ఇవి కూడా చదవండి:

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్‌ మీడియా కేసుల్లో రిమాండ్‌

టీటీడీలో రిటైర్మెంట్‌ కలవరం

For More AP News and Telugu News

Updated Date - Jul 06 , 2025 | 03:32 PM