Pemmasani Chandrasekhar:ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి: పెమ్మసాని
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:50 PM
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తారో.. అలాగే సీఎం చంద్రబాబు ఏపీని కూడా సురక్షితంగా ఉంచుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లా, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తారో.. అలాగే సీఎం చంద్రబాబు ఏపీని కూడా సురక్షితంగా ఉంచుతున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్, పలు కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వంలో రూ.10 వేలు ఇచ్చారు కానీ రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు ఆటో రిపేర్‌కి సరిపోయేవని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఆర్టీవో అధికారులు ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏపీ బడ్జెట్‌లో రూ. 60 వేల కోట్లు సంక్షేమ పథకాలకు తమ ప్రభుత్వం కేటాయిస్తోందని ఉద్ఘాటించారు. గుంటూరు నగరంలో బ్రిడ్జి నిర్మాణాలు జరుగుతున్నాయని.. ట్రాఫిక్ ఇబ్బందులు రానున్న రోజుల్లో ఉండవని వెల్లడించారు. ఆటో డ్రైవర్లకి కొన్ని ప్రాంతాల్లో విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఇన్సూరెన్స్ కట్టాలని కోరారు. గత జగన్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మధ్య వ్యత్యాసం గుర్తించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు.
చలానా రూపంలో వైసీపీ ప్రభుత్వం నడ్డి విరిచింది: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటోసోదరులకు పండుగ వాతావరణం తీసుకువచ్చారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆటోడ్రైవర్ల సేవలో పథకంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆటోడ్రైవర్ల కష్టాలని చూసి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలు సమయంలోనే ఆటో కార్మికులను ఆదుకునే పథకం తెస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని.. అనుకున్న విధంగానే అమలు చేశారని నొక్కిచెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి రూ.10వేలు ఇచ్చి చలానా రూపంలో నడ్డి విరిచిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రూ.15వేలు ఇచ్చిందని.... ఆర్టీసీని ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
జగన్ హయాంలో నాపై క్రిమినల్ కేసు.. అశోక్ గజపతిరాజు ఫైర్
Read Latest AP News And Telugu News