PM Modi Call On CM Chandrababu: సీఎం చంద్రబాబుకి మోదీ ఫోన్.. అసలు విషయమిదే..
ABN , Publish Date - Oct 12 , 2025 | 10:03 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న తనకు ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు. 15ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా గొప్ప విశేషమని మోదీ తనకు కితాబిచ్చారని తెలిపారు.
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నిన్న తనకు ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. 15ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా గొప్ప విశేషమని మోదీ తనకు కితాబిచ్చారని తెలిపారు. తాను 15ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం కంటే.. మోదీ 25 ఏళ్లు వరుసగా అధికారంలో ఉండటమే గొప్ప విశేషమని తాను చెప్పానని గుర్తుచేశారు. ఇవాళ(ఆదివారం) సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేశారు.
జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది..
ఏపీలో వైకుంఠ పాళీ విధానంతో గతంలో అధికారం కోల్పోయామని చెప్పుకొచ్చారు. ఇందులో ప్రజలు తప్పుచేయలేదు కానీ తానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఏపీ బాగుపడాలనే ఉద్దేశంతో పరిపాలన తప్పా మరేదీ తాను ఆలోచించలేదని తెలిపారు.1999 నుంచి 2004 మధ్య, అలాగే 2014 నుంచి 2019 మధ్య ఇదే తరహాలో వెళ్లి దెబ్బతిన్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
సుపరిపాలన మీదే దృష్టి సారించాం..
2014 నుంచి 2019 మధ్య ఏపీకి అన్యాయం జరిగిందనే ఆవేదనతో పరిపాలన తప్పా రాజకీయం పట్టించుకోక దెబ్బతిన్నామని గుర్తుచేశారు. ఏపీని ఎలాగైనా వేగంగా నిలబెట్టాలనే తపనతో ఈ తప్పటడుగులు పడ్డాయని చెప్పుకొచ్చారు. అందుకే ఈసారి రాజకీయ సుపరిపాలన మీదే దృష్టి సారించానని తెలిపారు. గత తప్పిదాలు ఇక పునరావృతం కావని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
సీనియర్లకు గౌరవం..
‘పార్టీలో సీనియర్లను గౌరవించుకుంటూనే యువతను ప్రోత్సహిస్తాం. యువత రాకతో సీనియర్ల ప్రాధాన్యం కోల్పోతున్నారనే వాదన సరికాదు. అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్లకు తగిన గౌరవం దక్కింది కదా?. యువతరం, నేటి తరం రాజకీయ నాయకుల కోసం పార్టీ పరంగా శిక్షణ తరగతులు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. శిక్షణ కోసం పార్టీ కార్యాలయంలో మరో భవనం కూడా సిద్ధమైంది. 1985 నుంచి పార్టీ నేతలకు నా ఆధ్వర్యంలోనే అనేక శిక్షణ తరగతులు జరిగాయి. అదే తరహాలో నవతరం రాజకీయ నాయకులను మంచి శిక్షణతో తయారు చేస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ స్కాంలని బయటపెడతాం.. మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
యువత కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తాం: పవన్ కల్యాణ్
For More AP News And Telugu News