Share News

Prathipati Pullarao: కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట

ABN , Publish Date - May 02 , 2025 | 02:38 PM

Prathipati Pullarao: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఏడారి, శ్మశానమన్న వైసీపీ నేతలు సిగ్గుతో తలలు దించుకొని రాజధానిలో తిరగడం అందరూ చూస్తారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

Prathipati Pullarao: కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట
Prathipati Pullarao

పల్నాడు జిల్లా: అమరావతి నిర్మాణ పున: ప్రారంభం తెలుగుజాతికి ఎనలేని సంతోషాల సంబరమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నేడు ప్రారంభమయ్యే పనుల జోరు..ఇకపై రాష్ట్రానికి తీసుకువచ్చే పరిశ్రమలు, పెట్టుబడుల హోరని అన్నారు. జగన్ దుష్ట, స్వార్థ రాజకీయాలకు బలైన అమరావతి కూటమి ప్రభుత్వ రాకతో బతికి బంగారు బాటపట్టిందని చెప్పారు. అమరావతి కోసం 1631 రోజులు పోరాడిన రైతుల ఆనందభాష్పాలు, భావోద్వేగాలతో నేటి అమరావతి సభ పులకిస్తుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.


మోదీ చేతులమీదుగా రూ.49వేల కోట్ల అమరావతి అభివృద్ధి పనులకు బీజం పడటం తెలుగుజాతికే గర్వకారణమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ శుభదినం దేశచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన గొప్పదినమని ఉద్ఘాటించారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి అవుతాయని చెప్పారు. పాలకుల ఆకాంక్షలు ఫలించి, ప్రజలకు అమరావతి ఫలాలు అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఇకపై ప్రతి ఆంధ్రుడు తన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటారని ఉద్ఘాటించారు. అమరావతిని ఏడారి, శ్మశానమన్న వైసీపీ నేతలు సిగ్గుతో తలలు దించుకొని రాజధానిలో తిరగడం అందరూ చూస్తారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.


చంద్రబాబు నేతృత్వంలో రాజధాని కల నెరవేరనుంది: మంత్రి సవిత

Savitha.jpg

అమరావతి: అమరావతి రాజధాని పునర్నిర్మాణ వేడుకలో భాగస్వాములవ్వడం ఆనందంగా ఉందని మంత్రి సవిత అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ వాసుల ప్రజా రాజధాని కల నెరవేరనుందని తెలిపారు. రాజధాని పనుల పున:ప్రారంభానికి ముఖ్య అతిథిగా వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయ పూర్వక స్వాగతం తెలిపారు. పెనుకొండ నియోజకవర్గం నుంచి 10 బస్సులు, 20కు పైగా కార్లలో కూటమి శ్రేణుల అమరావతికి చేరుకున్నారని మంత్రి సవిత చెప్పారు. గుంటూరు టోల్ గేట్ కాజా దగ్గర పెనుకొండ కూటమి నాయకులకు మంత్రి సవిత స్వాగతం పలికారు. కూటమి నాయకులకు అల్పాహారం, పండ్లను మంత్రి సవిత పంపిణీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోడెల శివప్రసాదరావుకు మంత్రి లోకేష్ నివాళి..

గొర్రెల స్కామ్.. దళారి మొయినుద్దీన్ అరెస్ట్..

For More AP News and Telugu News

Updated Date - May 02 , 2025 | 03:21 PM