Palla Srinivasa Rao Fires on Jagan: మద్యం స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్నాటకాలు.. పల్లా సెటైర్లు
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:40 PM
వేలాది ప్రాణాలు బలిగొన్న విషపూరిత మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే, ధర్నాల పేరుతో జగన్నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతుల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారని నిప్పులు చెరిగారు.
అమరావతి, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాల పేరుతో ఏపీలో శాంతి భద్రతలకు జగన్, ఆయన అనుచరులు విఘాతం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారని నిప్పులు చెరిగారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉందంటే, ఇది రైతు ద్రోహి పాలనకు ప్రత్యక్ష నిదర్శనం కాదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ(మంగళవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. తాను అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
లక్ష టన్నుల యూరియా సరఫరా...
‘ఖరీఫ్‌లో జగన్ ప్రభుత్వంలో కన్నా నేడు కూటమి ప్రభుత్వంలో లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తుంది నిజం కాదా?. వేలాది ప్రాణాలు బలిగొన్న విషపూరిత మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే, ధర్నాల పేరుతో జగన్నాటకాలు ఆడుతున్నాడు. కూటమి ప్రభుత్వం రైతుల వద్ద 68 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే రూ.18 వేల కోట్లు జమ చేసింది. వైసీపీ పాలనలో కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమే జమ చేశారు. రైతు భరోసాకు ఏపీ నిధుల నుంచి రూ.7500లు మాత్రమే ఇవ్వగా.. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవకు రూ.14000లు అందజేస్తున్నారు’ అని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ అసెంబ్లీకి రావాలి.. మంత్రి సంధ్యారాణి సవాల్
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
Read Latest Andhra Pradesh News and National News