Minister Kandula Durgesh: సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ పాత్ర ఉండదు: మంత్రి దుర్గేష్
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:01 PM
సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ పాత్ర ఉండదని, ఇది ఫిల్మ్ ఛాంబర్‌కు సంబంధించిన వ్యవహారమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ క్లారిటీ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం మంత్రి కందుల దుర్గేశ్‌తో సమావేశం అయ్యారు.
అమరావతి,ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ పాత్ర ఉండదని, ఇది ఫిల్మ్ ఛాంబర్‌కు (Telugu Film Chamber) సంబంధించిన వ్యవహారమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Minister Kandula Durgesh) క్లారిటీ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ(సోమవారం) మంత్రి కందుల దుర్గేశ్‌తో సమావేశం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ఏబీఎన్‌తో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి నిర్మాతల అభిప్రాయాలు తీసుకెళ్తామని తెలిపారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందని వెల్లడించారు. ఏపీలో సినీ పరిశ్రమ స్థిరపడాలనేది తమ అభిప్రాయమని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
వచ్చే నెలలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కావాలని నిర్మాతలు కోరారు. త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని మంత్రి కందుల మాటిచ్చారు. ఏపీలో ఉన్న టాలెంట్‌ను ఉపయోగించుకోవాలని కోరారు మంత్రి కందుల దుర్గేష్. ఒక ప్రత్యేక పాలసీ ఉండాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో ప్రభుత్వంతో సినీ ప్రముఖులు ప్రత్యేక చర్చలు జరపాలని మార్గనిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ తర్వాత ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై మరింత స్పష్టత రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AndhraPradesh News And Telugu News