Srushti Fertility Scam Case: సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో కీలక మలుపు
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:43 PM
సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో కీలక సూత్రధారి డాక్టర్ నమ్రతకు ఉచ్చు బిగిస్తోంది. డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్లు, బినామీ అకౌంట్లు, ఆస్తులపై దర్యాప్తు బృందం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో అక్రమ సరోగసీ, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా చేసి కోట్లాది రూపాయలను డాక్టర్ నమ్రత సంపాదించినట్లు సమాచారం.
విశాఖపట్నం, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో (Srushti Fertility Scam Case) కీలక సూత్రధారి డాక్టర్ నమ్రతకు (Doctor Namrata) ఉచ్చు బిగిస్తోంది. డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్లు, బినామీ అకౌంట్లు, ఆస్తులపై దర్యాప్తు బృందం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో అక్రమ సరోగసీ, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా చేసి కోట్లాది రూపాయలను డాక్టర్ నమ్రత సంపాదించినట్లు సమాచారం. డాక్టర్ నమ్రత ఆస్తులు, ఆర్థిక మూలాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘా పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్‌లో డాక్టర్ నమ్రత అక్రమ సామ్రాజ్యం విస్తరించింది.
శిశువులు చేతులు మారే విషయంలో ఒక్కొక్క శిశువుకు రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు. డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో బాధితుల నుంచి సేకరించిన సొమ్ము విషయంలో పోలీసులు దృష్టి సారించారు. డిజిటల్ రూపంలో లావాదేవీలు, నగదు రూపంలోని లావాదేవీలు ఎంతమేరకు జరిగాయనే బ్యాంక్ అకౌంట్‌లను దర్యాప్తు బృందం అధికారులు పరిశీలించనున్నారు. డాక్టర్ నమ్రతకి సహకరించిన బ్యాంక్ అకౌంట్‌లపై దర్యాప్తు బృందం నిఘా ఉంచింది.
డాక్టర్ నమ్రతతో పాటు సృష్టి బ్యాంక్ అకౌంట్‌లను దర్యాప్తు బృందం అధికారులు పరిశీలించారు. 2019 నుంచి 2025 వరకు భారీగా నగదు జమ అయినట్లు గుర్తించారు. సృష్టి పేరుతో సంపాదించిన అక్రమ సంపాదన ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాజస్థాన్‌కు చెందిన దంపతులు బయటకు రాగా, నల్లగొండకు చెందిన వారి నుంచి రూ.11 లక్షలు, ఓ ఎన్ఆర్ఐ నుంచి రూ.19 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన జంట నుంచి రూ.16 లక్షలు, మరో జంట నుంచి రూ.12.5 లక్షలను డాక్టర్ నమ్రత వసూలు చేసినట్లు దర్యాప్తు బృందం అధికారులు నిర్ధారించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AndhraPradesh News And Telugu News