Share News

Rain Alert in AP: రానున్న మూడు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 06:04 PM

వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Rain Alert in AP: రానున్న మూడు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు
Heavy Rains in Andhra Pradesh

అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని చెప్పుకొచ్చారు.


భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు ఆయా జిల్లాల ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. ఎవ్వరూ చెట్ల కింద ఉండవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ స్కాంలని బయటపెడతాం.. మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

యువత కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తాం: పవన్ కల్యాణ్

For More AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 06:50 PM