Share News

Heavy Rains In Telugu states: అల్పపీడనం ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:45 AM

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Heavy Rains In Telugu states: అల్పపీడనం ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Heavy Rains In Telugu states

అమరావతి, హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (Prakhar Jain) తెలిపారు. ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశ నుంచి ఒడిశా మీదుగా అల్పపీడనం కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ(మంగళవారం) శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ప్రఖర్ జైన్.


కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గ నిర్దేశం చేశారు ప్రఖర్ జైన్.


గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని.. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.78 లక్షల క్యూసెక్కులు చేరుకుందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ప్రవాహం 3.42 లక్షల క్యూసెక్కులు ఉందని.. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.


తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు..

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ(మంగళవారం), రేపు(బుధవారం) రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ(మంగళవారం) భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు‌తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్‌ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు

మాదక ద్రవ్య రహిత ఏపీ మా లక్ష్యం: అనిత

For More AP News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 12:05 PM