CM Chandrababu Naidu on Jobs: పరిశ్రమలు, ఐటీ, టూరిజం రంగాల్లో భారీగా ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:39 PM
కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు మాట్లాడారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు.
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు (CM Chandrababu Naidu) మాట్లాడారు. 15 నెలల్లో అన్నిరంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు. ఏయే రంగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామనే విషయాన్ని సెక్టార్ల వారీగా అసెంబ్లీలో వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామనే అంశాన్ని వెల్లడించారు సీఎం చంద్రబాబు.
మెగా డీఎస్సీ ద్వారా 15,941, వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093, పోలీస్ శాఖలో 6,100 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు క్లారిటీ ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ - జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రకటించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 5,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో మొత్తంగా 3,48,891 మందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ప్రైవేట్ సెక్టార్‌లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎంస్ఎంఈలు, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో మొత్తం 3.48 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఎవరూ ఎక్కడ, ఎప్పుడూ ఉద్యోగం పొందారు, ఏ జాబ్ చేస్తున్నారనే సమస్త వివరాలను పోర్టల్ ద్వారా కూడా వెల్లడిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఏపీ శాసనసభలో నాలా యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
Read latest AP News And Telugu News