Share News

Minister Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Jun 17 , 2025 | 09:02 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు ఢిల్లీలో బిజీ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు లోకేష్ షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు.

Minister Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
AP IT Minister Nara Lokesh Delhi visit

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు ఢిల్లీలో బిజీ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు లోకేష్ షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) రాత్రికి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నారా లోకేష్ బయలుదేరి వెళ్లనున్నారు. 18వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌‌తో లోకేష్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.


అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో లోకేష్ భేటీ అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో, సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో పలు అంశాలపై చర్చిస్తారు. 19వ తేదీ గురువారం ఉదయం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాతో సమావేశం అవుతారు. అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో సమావేశం కానున్నారు.


ఇవి కూడా చదవండి

సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 09:10 PM