Share News

Minister Ramanaidu: పవన్ కల్యాణ్ హమీని నెరవేర్చేలా ప్రత్యేక చర్యలు: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Dec 30 , 2025 | 07:50 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ రంగం చాలా నష్టపోయిందని ఆరోపించారు.

Minister Ramanaidu:  పవన్ కల్యాణ్ హమీని నెరవేర్చేలా ప్రత్యేక చర్యలు: మంత్రి నిమ్మల
AP Minister Nimmala Ramanaidu

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ రంగం చాలా నష్టపోయిందని ఆరోపించారు. 2017 నుంచి 2018 వరకు గత తెలుగుదేశం పాలనలో జరిగిన డ్రెడ్జింగ్ పనులు మినహా, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి పని కూడా జరుగలేదని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలసి మంత్రి నిమ్మల వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి నిమ్మల రామానాయుడు.


డ్రైన్ ద్వారా సముద్రపు నీరు రావడంతో వేలాది ఎకరాల్లో రైతులు కొబ్బరి పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, శంకరగుప్తం డ్రైన్ సమస్యను అన్నదాతలు, నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని ప్రస్తావించారు. ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా తాను పరిశీలించి, మరో రెండుసార్లు సమీక్షలు జరిపి రూ.20.77 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ కృషితో ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల అయ్యాయని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.


నేడు పనులు ప్రారంభించామని అన్నారు. పవన్ కల్యాణ్ హమీని నెరవేర్చేలా, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల శాశ్వత ముంపు పరిష్కారానికి రూ.13.4 కోట్లతో లైడార్ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. లైడార్ సర్వే అనంతరం డీపీఆర్ తయారు చేసి, శాశ్వతముంపు నివారణకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శదర్శనం

న్యూఇయర్.. హద్దు దాటితే కఠిన చర్యలు

For More AP News And Telugu News

Updated Date - Dec 30 , 2025 | 07:55 PM