Nara Rohit ON Political Entry: పొలిటికల్ ఎంట్రీ అప్పుడే.. నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:04 PM
రాజకీయ ఫ్యామిలీ నుంచే తాను వచ్చానని.. సమయం వచ్చినప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని యువ కథానాయకుడు నారా రోహిత్ ఉద్ఘాటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని నొక్కిచెప్పారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు.
తిరుపతి, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): రాజకీయ ఫ్యామిలీ(Political Family) నుంచే తాను వచ్చానని.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని యువ కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohit) ఉద్ఘాటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం (NDA Government) సుపరిపాలన అందిస్తోందని నొక్కిచెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇంకా ఏపీకి ఉద్యోగ అవకాశాలు రావాల్సి ఉందని తెలిపారు నారా రోహిత్.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఇవాళ(ఆదివారం) తిరుపతిలో సుందరకాండ మూవీ (Sundarakanda Movie) టీం పర్యటించింది. ఈ సందర్భంగా నారా రోహిత్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 27వ తేదీన సుందరకాండ సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు. సుందరకాండ సినిమాను కుటుంబం మొత్తం వెళ్లి చూడవచ్చని వివరించారు. ఇది రొమాంటిక్ సినిమా అని.. లవర్ బాయ్‌గా తాను నటించానని పేర్కొన్నారు. ఈ సినిమాలోని పాటలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయని వెల్లడించారు. ఈ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీదేవి (Heroine Sridevi) నటన అందరికీ నచ్చుతోందని నారా రోహిత్ పేర్కొన్నారు.
సుందరకాండ సినిమా అందరినీ అలరిస్తుంది: నిర్మాత సంతోష్
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతికి వచ్చామని సుందరకాండ చిత్రం నిర్మాత సంతోష్ (Producer Santosh) తెలిపారు. వినాయకచవితి రోజు (Ganesh Chaturthi Day) సుందరకాండ సినిమా అందరినీ అలరిస్తుందని వెల్లడించారు. ఈ సినిమాలోని పాటలు మనస్సును హత్తుకుంటాయని హీరోయిన్ వృతి వాఘాని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎరువులపై అలర్ట్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సురవరంతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం: సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News