Share News

Ayyanna Patrudu on women Leadership: అన్ని రంగాల్లో మహిళలు టాప్.. అయ్యన్న ప్రశంసలు

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:49 PM

సమాజం గురించి మహిళను ఎడ్యుకేట్ చేస్తే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. సురక్షిత సమాజ నిర్మాణం ఏ రాష్ట్రానికైనా ముఖ్యమని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.

Ayyanna Patrudu  on women Leadership: అన్ని రంగాల్లో మహిళలు టాప్.. అయ్యన్న ప్రశంసలు
Ayyanna Patrudu on women Leadership

తిరుపతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నారీమణులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chinthakayala Ayyanna Patrudu) దిశానిర్దేశం చేశారు. మూడు సంవత్సరాల తర్వాత జాతీయ మహిళా సదస్సును ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించుకోవటానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అప్పటికీ అమరావతి పూర్తయిపోతుందని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొని ప్రసంగించారు.


ఈ సదస్సులో ప్రముఖులు ఇచ్చిన సూచనలు మహిళల్లో ఆత్మవిశాసం పెంచేలా ఉన్నాయని నొక్కిచెప్పారు. ఈ సదస్సులో చాలా గొప్పగా చర్చలు జరిగాయని వెల్లడించారు. చర్చలు తనకు ఆనందాన్ని కలిగించాయని చెప్పుకొచ్చారు. పురుషులతో భాగంగా మహిళలకు సమాన హక్కులు ఏపీలో ఇప్పటికే ఇచ్చామని గుర్తుచేశారు. ఇది ఏపీకి మాత్రమే పరిమితం కాకూడదని... దేశం మొత్తం అమలయ్యేలా తీర్మానం చేసి అది అమలయ్యేలా చేయాలని సూచించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అధికారంలోకి వచ్చాకే మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యం మొదలైందని గుర్తుచేశారు అయ్యన్న పాత్రుడు.


తాను ఎమ్మెల్యే అయినప్పుడు గ్రామస్థాయిలో కూడా మహిళా ప్రాతినిథ్యం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని ఉద్ఘాటించారు. సమాజం గురించి మహిళను ఎడ్యుకేట్ చేస్తే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతోందని నొక్కిచెప్పారు. సురక్షిత సమాజ నిర్మాణం ఏ రాష్ట్రానికైనా ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సమావేశాలు జరగాలని ఆకాంక్షించారు. అందరూ కలిసి పని చేస్తే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 05:12 PM