CM Chandrababu: ఆ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:40 PM
కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.
అనంతపురం, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): కురుపాం (Kurupam), అనంతపురం (Anantapur) ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి (Minister Sandhyarani), అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రితో మాట్లాడారు సీఎం చంద్రబాబు. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనపై అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పరామర్శించనున్నారు మంత్రి సంధ్యారాణి. పార్వతీపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్‌తో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వెళ్తున్నట్లు సీఎంకు వివరించారు మంత్రి సంధ్యారాణి. అనంతపురంలో శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతిపై మంత్రి సంధ్యారాణితో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఈ రెండు ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News