Ketireddy Peddareddy: తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:56 PM
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసి డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
అనంతపురం, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి (Ketireddy Peddareddy) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) చుక్కెదురైంది. తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది డివిజన్ బెంచ్.
లా అండ్ ఆర్డర్ సమస్య వస్తోందంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అనంతపురం పోలీసులు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి ఇవాళ(బుధవారం) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది డివిజన్ బెంచ్. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News